వచ్చే యేడాది కల్లా దేశమంతా 5జీ.. శుభవార్త చెప్పిన ముకేశ్

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 5జీ సేవల విషయంలో కీలక ప్రకటన చేశారు. వచ్చే యేడాది డిసెంబర్ నాటికి ప్రతి గ్రామానికీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు 5జీ సేవలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ముకేశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే తరాన్ని కూడా కలిపే సాంకేతికత 5జీ అని ఆయన అభివర్ణించారు.

 

కృత్రిమ మేధాశక్తి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, బ్లాక్‌చైన్, మెటావెర్స్ వంటి 21వ శతాబ్దపు ఇతర టెక్నాలజీల సంపూర్ణ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవడానికి 5జీ సేవలు పునాదివంటివని తెలిపారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ కాస్తా. గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్ అవ్వాలని, దీనికి నాయకత్వం వహించేందుకు తాము సిద్ధంగానే వున్నామని ఈ సందర్భంగా ముకేశ్ ప్రకటించారు.

Related Posts

Latest News Updates