జమ్మూ కశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ దగ్గర ఆర్మీ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు జవాన్లు మృతి చెందారు. అయితే… ఈ ఘటన తెలిసిన తర్వాత ఆర్మీ ఉన్నతాధికారులు తీవ్ర షాక్ కి గురయ్యారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు ఎలా చెలరేగాయన్నది ఇప్పటికి తెలియడం లేదు. కారణాలు ఏంటన్న విషయంపై ఆర్మీ అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల బృందం ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేయాలని కేంద్ర రక్షణ శాఖ ఆదేశించింది.