అమెరికాలో మళ్లీ కాల్పులు… ఐదుగురు దుర్మరణం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. కెంటకీ రాష్ట్రంలోని డౌన్ టౌన్ లూయిస్ విల్లే ప్రాంతంలోని ఓల్డ్ నేషనల్ బ్యాంక్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా… ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడే వున్న భద్రతా సిబ్బంది దుండగుడిపై కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. మరోవైపు కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే… దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడన్నది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. తదుపరి నోటీసులు వచ్చే వరకూ ఆ ప్రాంతంలోకి ఎవ్వరూ రావొద్దని సూచించారు. కొన్ని రోజుల క్రిందటే అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. అమెరికాలోని నాష్ విల్లెలో ఓ ప్రాథమిక పాఠశాలలోకి ఓ వ్యక్తి చొరబడి, కాల్పులు జరిపాడు. ఆరుగురు చనిపోయారు.

Related Posts

Latest News Updates