జమ్మూ కశ్మీర్ లో విషాదం… లోయలో పడి ముగ్గురు సైనికుల దుర్మరణం

జమ్మూ కశ్మీర్ లో తీవ్ర విషాదం జరిగింది. కుప్వారా జిల్లాలోని ఎల్ఓసీ సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న భారత సైన్యానికి చెందిన ముగ్గురు సైనికులు లోయలో జారిపడి మరణించారు. ఈ ముగ్గురు జవాన్లు చినార్ కార్ప్స్ కి చెందిన వారు. ఇక… లోయలో పడిన ఈ ముగ్గురి జవాన్ల మృతదేహాలను సిబ్బంది వెలికి తీశారు. ప్రతిరోజూ విధిలో భాగంగా జవాన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా… పొగ మంచు కారణంగా దారి సరిగ్గా కనిపించకపోవడంతో లోయలో పడిపోయారు. ఈ విషయాన్ని ఆర్మీ చీనార్ కార్ప్స్ పేర్కొంది.

Related Posts

Latest News Updates