సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తరువాత హీరోగా, సరికొత్తగా నవదీప్ గా 2.Oగా కనిపించబోతున్న చిత్రం లవ్,మౌళి. విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ భాధ్యతలు తీసుకుంది. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ వినూత్నంగా అందరిని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల మాస్ కాదాస్ విశ్వక్‌సేన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్‌కు వస్తున్న స్పందన ఎంతో అద్బుతంగా వుంది. ఇటీవల ఇలాంటి వైవిధ్యమైన ట్రయిలర్‌ను చూడలేదని అందరూ కొనియాడుతున్నారు.