భయంతోనే పవన్‌కళ్యాణ్‌ పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు: ఆర్జీవీ ట్వీట్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. ఆ పార్టీకి కేవలం 24 సీట్లు కేటాయించడంపై సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఒక్క సీటు కిందికైనా, ఒక్క సీటు మీదికైనా పవన్‌కళ్యాణ్ మీద ట్రోల్స్‌ ఖాయమనే భయంతోనే పవన్‌ పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్‌ (X) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. https://cinemaabazar.com/

పొత్తులో భాగంగా జనసేనకు టీడీపీ 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలు కేటాయించింది. శనివారం ఉదయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారో వెల్లడించారు. ఈ నేపథ్యంలో జనసేనకు కేవలం 24 సీట్లే కేటాయించడంపై సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సెటైర్‌లు వేశారు. జనం ట్రోల్‌ చేస్తారనే భయంతోనే పవన్‌ పార్టీకి 24 సీట్లు కేటాయించారని ఎద్దేవా చేశారు. ‘23 సీట్లిస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు. 25 సీట్లిస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారని ట్రోల్ చేస్తారు. అందుకే మధ్యే మార్గంగా 24 సీట్లు ఇచ్చారు’ అని ఆర్జీవీ సెటైర్లు వేశారు. https://cinemaabazar.com/

జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై సోషల్‌ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన లేకుంటే టీడీపీ గెలువదంటూ గతంలో చెప్పిన పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పుడు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకోవడం అంటే జనసేన కార్యకర్తలను అవమానించడమేనని నెటిజన్‌లు విమర్శిస్తున్నారు. పదేళ్ల చరిత్ర ఉండి, గత ఎన్నికల్లో 130 స్థానాల్లో పోటీ చేసి, ఇప్పుడు కేవలం 24 స్థానాలకే పరిమితం కావడం అంటే.. పవన్‌ చంద్రబాబు ట్రాప్‌లో పడ్డాడని కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.

Related Posts

Latest News Updates