అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ కడియం రాజు శ్రద్ధాంజలి సభ ఉస్మానియా యూనివర్సిటీ, ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కేంద్రీయ కార్యకారిణి సభ్యులు మాననీయ బాగయ్య మాట్లాడుతూ కడియం రాజు జీవితం సార్ధకమైన జీవితం, సామాజిక సమరసతను, ఏకాత్మతను అనుసరించిన జాతీయవాద నిష్ఠ కలిగిన కార్యకర్త అని కొనియాడారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ మాననీయ సునీల్ అంబేకర్ జీ వీడియో ద్వారా సంతాప సందేశం అందించారు. తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ లింగం శ్రీధర్ జీ రాజన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రద్ధాంజలి సభలో సభావేధిక అలంకరించిన ABVP అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి శ్రీ బాలక్రిష్ణ, ABRSM అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి శ్రీ గుంత లక్ష్మణ్ , ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు శ్రీ మురళీ మనోహర్ , తెలంగాణ సామాజిక సమరసత అధ్యక్షులు శ్రీ వంశీ తిలక్ స్వర్గీయ కడియం రాజన్న ఏబీవీపీ జాతీయవాద సిద్ధాంతం కోసం నిలబడిన తీరు, పోరాట పటిమ, నిబద్ధతలను కొనియాడారు. సభా వేదికపై స్వర్గీయ కడియం రాజన్న కుటుంబ సభ్యులు, ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు డా.రావుల కృష్ణ , గ్రేటర్ హైదరాబాద్ సెక్రెటరీ శ్రీకాంత్ ఉన్నారు. ఓయూ విభాగ్ కన్వీనర్ పృథ్వి సభా అధ్యక్షత వహించారు.
బిజెపి నాయకులు ఎంపీ డా.లక్ష్మణ్ , బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ శ్రీ మురళీధర్ రావు ,
జాతీయ ఖాదీ బోర్డు సభ్యులు శ్రీ పేరాల శేఖర్జీ, మాజీ MLC రామచందర్ రావు , ఏబీవీపీ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ డా.మాసాడి బాపురావు , తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్. లింబాద్రి , MLC ఏబీఎన్ రెడ్డి , BMS రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామ్మోహన్ జీ, ప్రొఫెసర్. రాజరత్నం సర్, ఓయూ రిజిష్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ , ఔట ప్రెసిడెంట్ ప్రొఫెసర్. మనోహర్ , యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేష్ , ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. చింత గణేష్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. శ్రీరామ్ వెంకటేష్ పాల్గొన్నారు.
వీరితో పాటు ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ ప్రముఖ్ డా.రామకృష్ణ , డా.పారిపల్లి శంకర్ సర్, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు డా.నక్కల జానారెడ్డి , డా.వీరబాబు , డా.నరేందర్ రెడ్డి , డా.కళ్యాణ్ , శ్రీ అంబాల సత్తయ్య , బీజేపీ నాయకులు భాష , రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జ్యేష్ఠ కార్యకర్తలు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, ఏబీవీపీ ప్రస్తుత కార్యకర్తలు, స్వర్గీయ డా. కడియం రాజన్న ఆత్మీయ మిత్రులు పెద్ద ఎత్తున హాజరై కడియం రాజన్న గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.