23 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించిన బీజేపీ

కర్నాటక బీజేపీ తన అభ్యర్థుల రెండో జాబితాను కూడా విడుదల చేసింది. ఈ రెండో జాబితా 23 మంది అభ్యర్థులతో వుంది. కొత్తగా ప్రకటించిన రెండో జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దక్కలేదు. ఇక… 23 మందిలో ఇద్దరు మహిళలకు టిక్కెట్లిచ్చింది బీజేపీ. ఇంకా 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి వుంది. 12 మందితో జాబితాను బీజేపీ విడుదల చేస్తే… మూడో జాబితా కూడా వచ్చేసినట్లే.

 

అయితే… మాజీ సీఎం జగదీష్ షెట్టర్ పేరు రెండో జాబితాలో కూడా లేదు. ఇప్పటికే 183 మందితో కూడిన మొదటి జాబితాను బీజేపీ విడుదల చేసింది. అందులో ఏకంగా 56 మంది కొత్తవారు వున్నారు. ఇదో కొత్త ప్రయోగమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ప్రకటించారు. అయితే… అలాగే సుకుమార్ శెట్టి, మాదాల్ విరూపాక్షను కూడా పక్కనపెట్టింది. రవీంద్రనాథ్, నెహ్రూ ఓలేకర్ కి కూడా చోటు దక్కలేదు.

 

224 అసెంబ్లీ స్థానాలకుగానూ.. 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది బీజేపీ. తొలి జాబితాలో 52 మంది కొత్త వారికి అవకాశం కల్పించింది. ఈ లిస్ట్ లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ వెల్లడించారు.

మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యాడ్యురప్ప కుమారుడు బీవై విజయేంద్ర శికారిపుర స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఆ రాష్ట్ర మంత్రి బీ శ్రీరాములు బళ్లారి రూరల్ నుంచి పోటీ చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కి ప్రత్యర్థిగా బీజేపీ ఆర్. అశోకను బరిలోకి దింపింది. ఫస్ట్ లిస్టులో 52 మంది కొత్త అభ్యర్థులు, 32 మంది వెనుబడిన వర్గాల అభ్యర్థులు, 30 మంది షెడ్యుల్ కులాల అభ్యర్థులు ఉన్నారు. 9 మంది అభ్యర్థులు డాక్టర్లు, ఐదుగురు న్యాయవాదులు, ఇద్దరు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ,8 మంది మహిళలు ఉన్నారు.

 

సీనియర్లమైన తమను కాదని వీరికి టికెట్లు కేటాయించడం పట్ల అప్పుడే కొందరు తీవ్ర అసంతృప్తిని ప్రకటిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ సవాడీ బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ‘భిక్షాటన చేసే పాత్ర’తో తాను తిరగలేనని, తనకు ఆత్మగౌరవం ఉందని చెప్పిన ఆయన.. తానెవరి ప్రభావానికీ లొంగబోవడంలేదన్నారు. ఆయన అప్పుడే కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలో ఆ పార్టీలో చేరే సూచనలున్నాయని తెలుస్తోంది. నిజానికి మాజీ సీఎం, బీజేపీ నేత యెడియూరప్పకు లక్ష్మణ్ చాలా సన్నిహితులు. రాష్ట్రంలోని పవర్ ఫుల్ లింగాయత్ నేతల్లో ఒకరు. ఇక జాబితాలో తన పేరు లేని మరో మాజీ సీఎం జగదీశ్ షెట్టార్.. ఢిల్లీకి బయల్దేరారు. పార్టీ నాయకత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు.

 

 

Related Posts

Latest News Updates