తెలంగాణ మంత్రి హరీశ్ రావు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2016 లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, మీరు పర్యటిస్తూ ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తమన్నరు. మీరు హమీ ఇచ్చి ఆరేళ్లయిందని, హామీ ఏమైందని సూటిగా ప్రశ్నించారు. ఈ సెంటర్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం చౌటుప్పల్‌లో 8.2 ఎకరాల స్థలం కేటాయించింది. ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్‌కు నయా పైసా ఇవ్వలేదని దెప్పొపొడిచారు. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తమని కూడా హమీ ఇచ్చారు. అబద్ధపు హామీలిస్తూ, ప్రజా గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారో చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయం.’ అని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కు నయా పైసా ఇవ్వలేదు.మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తమని కూడా హమీ ఇచ్చారు.అబద్దపు హమీలిస్తూ,ప్రజా గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం మోహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నరు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ది చెప్పడం ఖాయం 2/2
— Harish Rao Thanneeru (@trsharish) October 20, 2022