కైకాల మరణంపై సంతాపం ప్రకటించిన సినీ ప్రముఖులు

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మరణంపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనతో వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు.

కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. 6 దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో ఆయనకు స్నేహ సంబంధాలన్నాయి. నాన్న గారితో కలిసి ఎన్నో సినిమాల్లో చేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు వేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా : బాలకృష్ణ

సత్యనారాయణ గారి అకాల మరణం నన్ను కలచివేసింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా – రామ్ చరణ్

కైకాల సత్యనారాణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటే. ఆయన నటించని పాత్రలు లేవు. భావోద్వేగ పాత్రల్లో నటిస్తే కన్నీళ్లు తెప్పించేవారు. ఏనాడూ వివాదాల జోలికి వెళ్లకుండా అందరితో స్నేహంగా ఉండేవారు. ఆయన అజాత శత్రువు. : దర్శకేంద్రుడు

తెలుగు సినీ పరిశ్రమలో నేను అభిమానించే నటుల్లో ఒకరు కైకాల సత్యనారాయణ. ఆయన మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది. మన ఇంట్లో మనషిలా అందరితో కలిసిపోయేవారు. సినిమాల్లో ఆయన నటన అద్భుతం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా – నాని

Related Posts

Latest News Updates