సిక్కింలో ఘోర ప్రమాదం : 16 మంది భారత జవాన్లు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది భారత జవాన్లు మరణించారు. ఉత్తర సిక్కిం జెమా వద్ద జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. అందులో 13 మంది జవాన్లు, ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు వున్నారు. చట్టేన్ అనే ప్రాంతం నుంచి తంగూ అనే ప్రాంతానికి బయల్దేరగా… మలుపు తీసుకునే సమయంలో జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు లోయలో పడింది. ఈ ఘటన జరగగానే రెస్క్కూ ఆపరేషన్ ప్రారంభమైంది. గాయపడిన నలుగురు సైనికులను ఆస్పత్రికి తరలించారు. మూడు వాహనాల ఆర్మీ కాన్వాయ్ చటెన్ నుంచి థంగు వైపు వెళ్తుండగా… కాన్వాయ్ లోని ఓ వాహనం లోయలో పడిపోయింది.

Related Posts

Latest News Updates