త్రిపురలో ప్రారంభమైన పోలింగ్… 13.23 శాతంగా నమోదు

త్రిపురలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగనుంది. అయితే… ఉదయం 9 గంటల వరకూ 13.23 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు. మొత్తం 28.14 లక్షల మంది ఓటర్లుండగా… వీరిలో 14,15,233 మంది పురుషులు, 13,99,289 మంది మహిళా ఓటర్లు వున్నారు. మొత్తం 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. వాటిలో 1,100 కేంద్రాలను సున్నితమైనవిగా, 28 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.

 

ప్రజలు భారీ సంఖ్యలో క్యూలో నిల్చుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అలాగే మాజీ సీఎం మాణిక్ సర్కార్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 60 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 31వేల మంది ఉద్యోగులు ఎన్నికల డ్యూటీలో ఉన్నారు. కేంద్రం నుంచి 25వేల మంది, రాష్ట్రం నుంచి 31వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. బీజేపీ 55 స్థానాల్లో, ఐపీఎఫ్​టీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఇందులో ఒకచోట మాత్రం స్నేహపూర్వక పోటీ ​ ఉంటుందని చెప్పారు. సీపీఎం 47 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 13 సెగ్మెంట్స్​ నుంచి బరిలో దిగింది. ఇక తిప్రమోత పార్టీ 42 స్థానాల్లో బరిలో దిగింది. టీఎంసీ 28 స్థానాల్లో, 58 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Related Posts

Latest News Updates