నాసిక్ దగ్గర ఘోర ప్రమాదం.. దగ్ధమైపోయిన బస్సు… 12 మంది ప్రయాణికులు దుర్మరణం

మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర తెల్లవారుఝామున ఘోరం జరిగింది. డీజిల్ ట్రక్కును ఓ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో బస్సు మొత్తానికి మంటలు అంటుకున్నాయి. దీంతో 12 మంది ప్రయాణికులు మరణించారు. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషాదం ఏమిటంటే… ప్రయాణికులందరూ నిద్రలో వుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగే సమయంలో ఈ బస్సులో 30 మంది ప్రయాణికులు వున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

 

మరోవైపు బస్సుకు మంటలు అంటుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులను మహారాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆ రాష్ట్ర మంత్రి దాదా భూసే తెలిపారు.

 

ఈ ఘటనపై ప్రయాణికురాలు అనితా చౌదరీ స్పందించారు. ఈ ప్రమాదం జరిగే సమయంలో బస్సులో అందరూ నిద్రలో వున్నారని, ఈ సమయంలోనే పెద్ద శబ్దం వినిపించిందని తెలిపారు. దీంతో నా బిడ్డను తీసుకొని, బయటికి రావడానికి ప్రయత్నించాను. దీంతో నేను బతికి బట్టకట్టాను. తొందరగా నిద్రలో నుంచి మేల్కోవడంతోనే బతికాం. అని తెలిపారు.

 

Related Posts

Latest News Updates