ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దారుణం.. 11 మంది పోలీసుల దుర్మరణం

ఛత్తీస్ గఢ్ దంతెవాడ జిల్లా అరాన్ పుర్ సమీపంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లతో వెళ్తున్న బస్సును టార్గెట్ చేసి, ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన పోలీసులు డిఫెన్స్ రీసెర్చ్ కు టీంకు చెందిన వారిగా గుర్తించారు  అధికారులు. మృతుల్లో 10 మంది డీఆర్జీ పోలీసులు, 1 డ్రైవర్ ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు.

 

అరన్ పూర్ లో మవోయిస్టుల ఉనికి ఉందన్న పక్కా సమాచారంతో డీఆర్జీ బృదం.. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టింది. పోలీసులు పహారా ముంగించుకుని తిరిగి తమ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మందుపాతరతో మినీ బస్సును పేల్చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మరోవైపు సీఎం భాగేల్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు.

ఛత్తీస్ గఢ్ దంతెవాడ జిల్లాలో పోలీసులపై మావోయిస్టుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. సమాజం కోసం జవాన్లు చేసిన త్యాగాన్ని దేశం ఎన్నటికీ గుర్తుంచుకుంటుందని ట్వీట్ చేశారు. ”దంతెవాడలో ఛత్తీస్‌గఢ్ పోలీసులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దాడిలో మనం కోల్పోయిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాను. వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి ప్రకటిస్తున్నా” అని మోదీ ట్వీట్ చేశారు.

 

 

Related Posts

Latest News Updates