అమెరికాలో మళ్లీ కాల్పుల మోత. వర్జీనియాలోని వాల్ మార్ట్ స్టోర్ లో ఈ కాల్పులు జరిగాయి. గన్ తో ఓ వ్యక్తి స్టోర్ లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 10 మంది చనిపోయారని సమాచారం. ఈ కాల్పుల తర్వాత దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు 45 నిమిషాల పాటు దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో 10 మంది ప్రాణాలు కోల్పోగా… మరి కొందరు గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారన్నది మాత్రం పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే… వాల్ మార్ట్ లో పనిచేసే మేనేజరే ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది.
https://twitter.com/officer_Lew/status/1595274628263444482?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1595274628263444482%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2F