నాసిక్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం… 10 మంది దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాసిక్- షిర్డీ హైవేపై ఓ బస్సు ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో 10 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. యితే ఈ బస్సులో దాదాపు 50 మంది వరకు ఉన్నట్లు సమాచారం. అయితే… ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో మాత్రం ఇంకా తెలియడం లేదు. బస్సులో షిర్డీ యాత్రికులు వున్నారు. ఠాణె జిల్లా నుంచి యాత్రికులను తీసుకొని ఓ ప్రైవేట్ బస్సు షిర్డీకి బయల్దేరింది.

నాసిక్ షిర్డీ హైవేపై బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. దీంతో 10 మంది మరణించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ శిండే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

Related Posts

Latest News Updates