ఈడబ్యూఎస్ రిజర్వేషన్లు సరైనవే.. తీర్పు వెలువరించిన సుప్రీం

అగ్రవర్ణ పేదలకు 10 శాతం ఇచ్చే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో10 శాతం కోటా నిర్ణయాన్ని సమర్థించింది. దీనికి సంబంధించి 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్దమే అని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే.. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత వుంటుందని తీర్పునిచ్చింది. ఈ రిజర్వేషన్లను సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేదీ సమర్థించారు. ఈ రిజర్వేషన్లను కలిపిస్తూ చేసిన 103 వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధమైందని, రాజ్యాంగ మూల సూత్రాలను ఉల్లంఘించలేదని జస్టిస్ దినేష్ మహేశ్వరి పేర్కొనగా, ఈ వ్యాఖ్యలను జస్టిస్ బేలా త్రివేదీ సమర్థించారు. రిజర్వేషన్లు కొంద‌రి ప్రయోజనాల కోసం కాక సామాజిక, ఆర్థిక.. అసమానతలు అంతం చేయడానికి అనుమతించబడ్డాయని జ‌స్టిస్ జె.బి.పార్ధీవాలా పేర్కొన్నారు.

 

 

2019 సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చింది. 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుదీర్ఘ విచారణ చేసిన ధర్మాసనం… ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించింది.

Related Posts

Latest News Updates