ధర్నా చేస్తే 20 వేలు, రూల్స్ అతిక్రమిస్తే 30 వేల జరిమానా… ఢిల్లీ JNU లో కొత్త నిబంధనల జారీ

ఢిల్లీ JNU కొత్త నిబంధనలను జారీ చేసింది. ఇకపై… యూనివర్శిటీలో ఎవరైనా ధర్నాలో పాల్గొంటే… 20,000 రూపాయల జరిమానా విధిస్తామని ఓ సర్క్యులర్ జారీ చేసింది. అంతేకాకుండా ర్యాగింగ్, హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు తెలిస్తే… ఆ విద్యార్థి అడ్మిషన్ రద్దు చేసేస్తారు. యూనివర్శిటీ నిబంధనలను అతిక్రమించడం, ఎదుటి వారిని అవమానపరుస్తూ మాట్లాడితే ఏకంగా 30 వేల జరిమానా విధిస్తామని యాజమన్యం తన సర్క్యులర్ లో స్పష్టంగా పేర్కొంది. 10 పేజీలతో కూడిన సర్క్యులరుని వీసీ శాంతిశ్రీ డీ పండిట్ జారీ చేశారు.

 

ఈ కొత్త నిబంధనలు ఈ నెల 3 నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై BBC ఓ డాక్యుమెంట్ ని తయారు చేసింది. దీనిని యూనివర్శిటీ క్యాంపస్ లో కొన్ని విద్యార్థి సంఘాలు ప్రదర్శించాయి. దీనిపై ABVP లాంటి విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో యూనివర్శిటీలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అలాగే.. కొన్ని రోజుల క్రితం కూడా కొన్ని సంఘటనలు జరగడంతో యూనివర్శిటీ సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related Posts

Latest News Updates