హైదరాబాద్ లో ఈడీ సోదాలు మళ్లీ జరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచే ప్రముఖ ఫార్మా కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. అయితే… 15 బృందాలుగా అధికారులు విడిపోయి సోదాలు చేస్తున్నారు. పటాన్ చెరు, జూబ్లీ, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లితో సహా 15 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కూడా హైదరాబాద్ లో ఈడీ సోదాలు జరిగాయి. కొంత కాలం తర్వాత మళ్లీ నేడు ఈడీ సోదాలకు దిగింది.







