‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాతో ఆ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. లెజెండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా, రాంచరణ్ బర్త్ డే రోజున విడుదలైన టైటిల్ పోస్టర్‌తో ఒక్క సారిగా సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా సోమవారం చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.
లేటెస్ట్గా రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్లో చరణ్ అల్ట్రా స్టైలిష్‌లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌తో మెగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు దిల్‌రాజు గతంలోనే ప్రకటించాడు. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా కియారా అద్వాణి, అంజలిలు నటిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందించాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాడు.
https://twitter.com/SVC_official/status/1640286585148293120?s=20













