సెల్ఫీ ఛాలెంజ్ పై చంద్రబాబుని ఎద్దేవా చేస్తూ.. సవాల్ విసిరిన సీఎం జగన్

వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వేదికగా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఏపీలో ఎవరి హయాంలో ఎంత మేలు జరిగిందన్న విషయంలో బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు వుందా? అని సవాల్ విసిరారు. ఏ జిల్లాను తీసుకున్నా… టీడీపీ హయాంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత? తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి ఎంత? చర్చిద్దామా? అని ప్రశ్నించారు.

 

అయితే… ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసని, ఇంటింటికీ తెలుసని ఎద్దేవా చేశారు. అందుకే నిజాలు దాస్తున్నారని, నిందలు, అబద్ధాలతో ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో పక్కా ఇళ్లస్ళలమైనా ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన 30 లక్షల ఇళ్ల పట్టాల విషయం టీడీపీ మరిచిపోయిందన్నారు. అలాంటి ఇళ్ల స్థలాల ముందు సెల్ఫీ దిగే నైతిక హక్కు వుందా? అని జగన్ మండిపడ్డారు. టిడ్కో ఇళ్లపై సెల్ఫీ ఛాలెంజ్ అంటున్నారని, సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫోటోలు కాదని, సెల్ఫీ ఛాలెంజ్ అంటే ప్రతి ఇంటికీ వెళ్లి ఏం చేశారో చెప్పండని సవాల్ విసిరారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,39,068 మంది మహిళలకు రూ. 658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, వెలమ, క్షత్రియులతోపాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన.. 45-60 ఏళ్ల మధ్య ఉన్న ఈబీసీకి చెందిన మహిళలకు ఏటా రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. ఈ పథకం కింద మూడేళల్లో రూ.45 వేలను ఒక్కొక్కరికి అందజేస్తోంది ప్రభుత్వం.

Related Posts

Latest News Updates