వందే భారత్ రైలుపై దుండగులు మళ్లీ రాళ్ల దాడి చేశారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య ప్రారంభమైన వందే భారత్ రైలుపై దుండగులు రాళ్ల దాడికి దిగారు. దీంతో కోచ్ భాగం పాక్షికంగా ధ్వంసమైంది. అంతేకాకుండా సీ8 బోగీ అద్దం కూడా పగిలింది. ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. దాడి కారణంగా గురువారం విశాఖ నుంచి ఉదయం 5:45 కు సికింద్రాబాద్ కు బయలు దేరాల్సిన ట్రైన్ 9:45 బయలుదేరుతుందని అధికారులు ప్రకటించారు. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.