సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే డేటింగ్…. ఇది నిజమేనా?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే డేటింగ్ చేస్తున్నట్లు ఈ మధ్య పుకార్లు వస్తున్నాయి. అయితే.. దీనిపై సల్మాన్ తో డేటింగ్ వార్తలపై పూజా స్పందించింది. ఆ వార్తను పూజా హెగ్డే కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలు తాను చదివానని ..ప్రజెంట్ తాను సింగిల్ గానే ఉన్నానని చెప్పింది. తనకు సింగిల్ గానే ఉండటం ఇష్టమని..తన ఫోకస్ అంతా కెరీర్ పైనే ఉందని తెలిపింది. డేటింగ్ వార్తలను తాను అసలు పట్టించుకోనని.. సల్మాన్ తో నటించడం తనకు ఒక గొప్ప అనుభవం అని చెప్పుకొచ్చింది.

 

సల్మాన్ సెట్ లో చాలా ఫ్రీగా ఉంటాడని వెల్లడించింది.స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ అన్ని భాషల్లోనూ బిజీగా ఉంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB28 చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, బాలీవుడ్‌లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా మారింది ఈ బ్యూటీ.

Related Posts

Latest News Updates