ఎప్పుడైతే సమంతతో నాగచైతన్య వైవాహిక బంధం ముగిసిందో… అప్పటి నుంచి నాగచైతన్యపై తెగ ట్రోల్స్ జరుగుతున్నాయి. శోభిత ధూళిపాళతో నాగచైతన్య డేటింగ్ లో వున్నాడన్నది తెగ ట్రోల్ అవుతోంది. అయితే.. ఇది ఇప్పటి వరకు పుకారే. దీనిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి రిలేషన్ షిప్‌పై నటి సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎవరు ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నారనేది తాను పట్టించుకోనని, ప్రేమకు విలువ ఇవ్వనివారు ఎంతమందితో డేటింగ్ చేసినా, చివరికి కన్నీళ్లే మిగులుతాయంటూ హాట్ కామెంట్స్ చేసింది సమంత. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుని, అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది అంటూ కామెంట్స్ చేసినట్లు తెగ వైరల్ అయ్యింది. అయితే… దీనిపై సమంత స్పందించారు. తాను అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ అనలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సమంత ట్వీట్ చేసింది.
I never said this!! https://t.co/z3k2sTDqu7
— Samantha (@Samanthaprabhu2) April 4, 2023