నిర్మాణంలో వున్న కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సందర్శించారు. ఆయన వెంట మంత్రులు హరీశ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతంగా జరగాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా నాణ్యతలో రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.సెక్రటేరియట్ డిజైన్లను ఆయన మరోసారి పరిశీలించారు. గతంలోనూ సీఎం పలుమార్లు జరుగుతున్న పనులను పరిశీలించారు.