”శాకుంతలం” లేటెస్ట్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్

సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శాకుంతలం’ కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్‌ 14న విడుదల చేస్తామని శుక్రవారం వెల్లడించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్‌ రూపొందించారు. దిల్‌ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన వాయిదా వేసినట్టుగా ఇటీవల ప్రకటన చేశారు.

Related Posts

Latest News Updates