వైఎస్ వివేకా హత్య కేసు : కౌంటర్ దాఖలు చేయాలని దస్తగిరి హైకోర్టు నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని, దస్తగిరిని సీబీఐ అధికారులు అప్రూవర్‌గా మార్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా.. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చవద్దని భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు.. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని నిందితుడు దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

 

తదుపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. తనకు ప్రాణాహానీ ఉందంటూ కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి , ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు సెక్యూరిటీని పెంచాలని కోరారు. దీంతో దస్తగిరికి పోలీసులు భద్రత పెంచారు. దస్తగిరికి రక్షణగా ఇప్పటికే ఉన్న కానిస్టేబుల్‌తో పాటు మరో ఐదుగురు పోలీసుల సిబ్బందితో రక్షణ కల్పించారు.

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డిల నుంచి ఇప్పటికీ తనకు ప్రమాదం పొంచి ఉందని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వ్యాఖ్యానించారు. తాను అప్రూవర్‌గా మారడానికి వైఎస్ వివేకా కుమార్తె సునీత, సీబీఐ నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.  తాను అప్రూవర్‌గా మారడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారని.. అయితే, అప్రూవర్‌గా మారేవేళ వైఎస్ అవినాష్‌ రెడ్డి లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. వాళ్ల వరకు రానంత వరకు దస్తగిరి మంచోడు.. ఇప్పుడు చెడ్డవాడా అని ప్రశ్నించారు.

Related Posts

Latest News Updates