వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. నిజానికి షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం విచారణకు రావాలని సీబీఐ నోటీసులిచ్చింది. విచారణలో భాగంగా హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి హాజరయ్యే సమయంలో విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు తాజాగా నోటీసులిచ్చింది సీబీఐ.

 

మరోవైపు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసుకున్నారు. అవినాష్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3:45 నిమిషాలకు ముందస్తు బెయిల్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్ పిటిషన్ లో అవినాశ్ రెడ్డి కీలక అంశాలను పేర్కొన్నారు. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దస్తగిరి వాంగ్మూలం మేరకు తనను ఇరికించాలని సీబీఐ చూస్తోందన్నారు.