లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ కి ఊరట.. అనర్హత వేటును ఉపసంహరించుకున్న లోక్ సభ

లక్షద్వీప్ ఎంపీ ముహమ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటును లోక్‌సభ బుధవారం ఉపసంహరించుకుంది.ఈ మేరకు లక్షద్వీప్ ఎంపీ ముహమ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటును ఉపసంహరించుకుంటూ లోక్‌సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. తన అనర్హతకు వ్యతిరేకంగా ఫైజల్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా లోక్‌సభ సెక్రటేరియట్ అత్యవసర సర్క్యులర్ జారీ చేసింది.గతంలో కావరాతి కోర్టు తీర్పు నేపథ్యంలో ఫైజల్‌ను ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ ఫైజల్ లోక్‌సభ కార్యదర్శిపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ పెండింగ్‌లో ఉండగానే ఎంపీ అనర్హత వేటును ఉపసంహరించుకుంటూ లోక్‌సభ ఉత్తర్వులు జారీ చేసింది.

Related Posts

Latest News Updates