రెండో రోజూ పార్లమెంట్ లో అదే రగడ… రేపటికి వాయిదా

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. రెండో రోజు కూడా సభలో గందరగోళమే నెలకొంది. రెండో రోజు కూడా విదేశీ గడ్డపై కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన కామెంట్స్ పై దుమరాం మొదలైంది. రాహుల్ గాంధీ జాతికి వెంటనే క్షమాపణలు చెప్పాలని అధికార బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. విపక్ష నేతలు కూడా ప్రతిగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి తో సహా పలువురు ఎంపీలు డిమాండ్ చేశారు.

 

రాహుల్ వెంటనే సభలోకి వచ్చి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో గందరగోళం ఏర్పడటంతో లోకసభ మధ్యాహ్నం వరకూ వాయిదా పడింది. ఇక రాజ్యసభలో కూడా గందరగోళం ఏర్పడింది. దీంతో రాజ్యసభ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది. మళ్లీ 2 గంటలకు ప్రారంభమైనా… గందరగోళం అలాగే కొనసాగడంతో ఉభయ సభలూ బుధవారానికి వాయిదా పడ్డాయి.

 

మరోవైపుRRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ లభించింది. అలాగే షార్ట్ ఫిల్మ్ ద ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ కి కూడా ఆస్కార్ లభించింది. ఈ నేపధ్యంలో రాజ్యసభ RRR టీమ్ కి, ద ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ టీమ్ కి కంగ్రాట్స్ చెప్పింది. ఇండియ‌న్ సినిమాకు ఆస్కార్ అవార్డులు ద‌క్క‌డం అది మ‌న వైభ‌వాన్ని చాటుతుంద‌ని చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్(Chairman Jagdeep Dhankar) తెలిపారు. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర రంగానికి ఇది ఒక కొత్త గుర్తింపుని ఇచ్చింద‌న్నారు. ప్ర‌పంచ దేశాల నుంచి మ‌న సినిమాల‌పై ప్ర‌శంస‌లు అందుతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అవార్డులు గెలిచిన ఆర్ఆర్ఆర్, ద ఎలిఫెంట్ విష్ప‌ర‌ర్స్ చిత్ర బృందాల‌కు స‌భ త‌ర‌పున కంగ్రాట్స్ చెబుతున్న‌ట్లు చైర్మెన్ జ‌గ‌దీప్ పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates