రామగుండంతో పాటుగా దేశంలోని 18 రాష్ట్రాల్లో 91 FM ట్రాన్స్‌మిటర్‌లను ప్రారంభించిన మోదీ

పెద్దపల్లి జిల్లా రామగుండంతో పాటుగా దేశంలోని 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో 100 వాట్స్ సామర్థ్యం కలిగిన 91 FM ట్రాన్స్‌మిటర్‌లను ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 28 శుక్రవారం రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వినోదం, క్రీడలు, వ్యవసాయం, వాతవారణానికి సంబంధించిన సమాచారాన్ని స్థానిక ప్రజలకు చేరవేయడంలో FM ట్రాన్స్‌మిటర్‌లు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోడీ అన్నారు. 84 జిల్లాల్లో 91 కొత్త 100 వాట్ల FM ట్రాన్స్‌మిటర్‌లను ఇన్‌స్టాల్ చేయడం జరిగిందని మోడీ తెలిపారు. త్వరలో తాను రేడియోలో ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్‌లో ప్రసంగిస్తానని మోడీ అన్నారు. దేశప్రజలతో ఈ రకమైన భావోద్వేగ అనుబంధం రేడియో ద్వారా మాత్రమే సాధ్యమైందని చెప్పారు.

 

దేశ వ్యాప్తంగా 91ఎఫ్ఎం ట్రాన్స్ మిటర్ ల ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో భాగంగా రామగుండం రిలే స్టేషన్ ను వర్చువల్ గా మోదీ ప్రారంభించారు. ఇందుకోసం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్ షిప్ లోని ఎఫ్ఎం రిలే స్టేషన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రామ గుండం ప్రాంత ప్రజలకు 100.1 MHZ ఫ్రీక్వెన్సీలో ఎఫ్ఎం సేవలు అందుబాటులో వుంటాయి. స్టేషన్ నుంచి 15 కిలోమీటర్ల మేర ప్రేక్షకులు ఎఫ్ఎం సేవలను పొందుతారు. హైదరాబాద్ నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలు రామగుండం నుంచి ప్రసారం చేయబడతాయి.

Related Posts

Latest News Updates