మోదీని ఇరికించమని సీబీఐ తెగ ఒత్తిడి తెచ్చింది : సంచలన ఆరోపణ చేసిన అమిత్ షా

కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ వారికి వెన్నతో పెట్టిన విద్య అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా విరుచుకుపడ్డారు. యూపీఏ హయాంలో సీబీఐని ఎలా దుర్వినియోగం చేశారో అమిత్ షా బట్టబయలు చేశారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో బూటకపు ఎన్ కౌంటర్ లో మోదీని ఇరికించాలని, ఆయనను ఇబ్బంది పెట్టాలని సీబీఐ అధికారులు తనపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని సంచలన విషయాన్ని వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలన్నీ పసలేని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు.

 

సౌరాబుద్దీన్ కేసు విషయంలో తనపై కేసులు పెట్టారని, అప్పుడు తాను గుజరాత్ హోమంత్రిగా వున్నానని గుర్తు చేసుకున్నారు. సొహ్రాబుద్దీన్ కేసు దర్యాప్తు సమయంలోనే… అప్పటి సీఎం మోదీని ఇందులో ఇరికించాలని తనపై సీబీఐ తెగ ఒత్తిడి తెచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడి, పదవులు కోల్పోయిన నేతలు చాలా మందే వున్నారని, రాహుల్ ఒక్కరే కాదని, ఆయన నుంచే ప్రారంభం కాలేదని దెప్పిపొడిచారు. ఈ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, కోర్టులకు వెళ్లి పోరాటం చేయాల్సింది పోయి, తమపై చేస్తున్నారని అమిత్ షా దెప్పిపొడిచారు. దీనిని వదిలేసి ప్రధాని మోదీపై పడటం ఏంటని అసహనం వ్యక్తం చేశారు.

Related Posts

Latest News Updates