మరో నెల రోజుల్లో నాగచైతన్య కస్టడీ సినిమా విడుదల కానుంది. నాగచైతన్య కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇదే. ఈ సినిమాలో చైతన్య కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. పైగా మానాడు వంటి బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించిన వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ద్విభాషా సినిమాగా రూపొందిన కస్టడీ మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ఇప్పటి నుంచే అప్‌డేట్‌లను ఇవ్వడం స్టార్ట్ చేసింది. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌ను ప్రకటించింది.ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌ను త్వరలో వెల్లడించనున్నట్లు ఓ చిన్న గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్‌రాజా ఇద్దరూ స్వరాలు అందిస్తున్నారు.
https://twitter.com/SS_Screens/status/1643924008398905344?s=20