మణిపూర్ లో దుండగులు రెచ్చిపోయారు. చురచంద్ పూర్ జిల్లాలోని న్యూలమ్కా వద్ద ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కార్యక్రమం కోసం సిద్ధం చేసిన వేదికను అల్లరి మూకలు ధ్వంసం చేశారు. అంతేకాకుండా నిప్పు పెట్టారు. దీంతో సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అంతేకాకుండా సభహ కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు కూడా తగలబడ్డాయి. షెడ్యూల్ ప్రకారం సీఎం బీరేన్ సింగ్ న్యూలమ్కాలో జిమ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించాల్సి వుంది. కానీ… దుండగులు నిప్పు పెట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు… రంగంలోకి దిగి, దుండగులను చెదరగొట్టారు. మరోవైపు.. ఈ ఘటనను నిరసిస్తూ ఇండీజినస్ ట్రైబ్ లీడర్స్ ఫోరమ్ ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకూ బంద్ కి పిలుపునిచ్చింది.
మణిపూర్‌లోని చురాచంద్రపూర్ జిల్లాలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. గుంపులు గుంపులుగా ప్రజలు గుమిగూడవద్దని పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేశారు. సీఎం బీరెన్ పాల్గొనే సభావేదికకు అల్లరి మూకలు నిప్పు పెట్టారు. సభా ప్రాంగణంలో వున్న కుర్చీలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపేశామని, 144 సెక్షన్ విధించామని పోలీసులు ప్రకటించారు. రిజర్డ్వ్ ఫారెస్ట్ ఏరియా నుంచి రైతులను, గిరిజనులను బయటకు పంపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం ఆరోపిస్తోంది. దీనిని నిరసిస్తూ… ఈ నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. మరో వైపు సీఎం ప్రారంభించే జిమ్ ను కూడా అల్లరి మూకలు ధ్వంసం చేసేశాయి. మరోవైపు ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరెన్ పర్యటన వుంటుందా? వుండదా? అన్నది అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.