హైదరాబాద్ పంజాగుట్ట కూడలిలో అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు పెడతామని ఆయన ప్రకటించారు. సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్ కు సాధ్యమని అన్నారు. దేశంలోనే అతిపెద్దదైన ఆయన విగ్రహాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణమని తెలిపారు.
కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం సాహసోపేతమైనదని కేసీఆర్ వెల్లడించారు. పార్లమెంట్ కు కూడా అంబెద్కర్ పేరు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందన్న కేటీఆర్ .. ఆయన లేకపోతే తెలంగాణ లేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.