బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ లీగల్ సెల్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సంజయ్ కి కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. అయితే… దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని బండి సంజయ్ న్యాయవాదులు పేర్కొన్నారు. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ కి హైకోర్టు అనుమతి ఇవ్వడంతో త్వరలోనే బండి సంజయ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే.. వరుసగా 3 రోజుల పాటు సెలువులు వున్నందున నేడే హనుమకొండ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని బండి సంజయ్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.