బీబీసీపై నిషేధానికి సుప్రీం కోర్టు తిరస్కరణ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బీబీసీ (BBC) కార్యకలాపాలను భారత దేశంలో నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం తోసిపుచ్చింది. పూర్తిగా తప్పుడు అవగాహనతో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారని పేర్కొంది. భారత దేశ వ్యతిరేక వైఖరిని బీబీసీ అవలంబించిందని, అందుకే దానిని బ్యాన్ చేయాలంటూ హిందూ సేన చీఫ్ విష్ణుగుప్త పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం స్పందిస్తూ, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఓ డాక్యుమెంట్ దేశంపై ఎలా ప్రభావం చూపుతుందని ప్రశ్నించింది. అయితే.. పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ… ఈ డాక్యుమెంటరీ వెనుక కుట్ర దాగి వుందని, ఎన్ఐఏతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 

అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ వివాదాస్పదం కావడం తెలిసిందే. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తయారైన ఈ డాక్యుమెంటరీ బీజేపీ వర్గాలను తీవ్ర ఆగ్రహనికి గురిచేసింది. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే, ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది. ఇది పూర్తిగా అపోహలతో కూడుకున్న పిటిషన్ అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Related Posts

Latest News Updates