బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారు. ఇంట్లో నానా విధ్వంసం సృష్టించారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి అంటూ రెచ్చిపోయారు. ఎంపీ అర్వింద్ ఇంట్లోకి చొచ్చుకెళ్లి ఫర్నీచర్, పూల కుండీలను ధ్వంసం చేశారు.అంతేకాకుండా ఆయన ఇంటి ముందే అర్వింద్ దిష్టి బొమ్మను ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎంపీ అర్వింద్ పై మండిడప్డారు. మరోమారు నోరు పారేసుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా తాను ఓడిస్తానని ప్రకటించారు. తాను కాంగ్రెస్ తో టచ్ లో వున్నట్లు కాంగ్రెస్ సెక్రెటరీ చెప్పినట్లు అర్వింద్ అన్నారని, అర్వింద్ కాంగ్రెస్ తో ఎందుకు టచ్ లో వున్నారని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో అందరికీ సంబంధాలుంటాయని అన్నారు. నిజామాబాద్ కు పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చి, రైతులను అర్వింద్ మోసం చేశారని ఆరోపించారు.