తెలంగాణలో కాంగ్రెస్ కి ఝలక్ తగలనుందా? ఆ పార్టీకి సీనియర్ నేత కష్టకాలంలో గుడ్ బై చెబుతున్నారా? ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన బీజేపీలో చేరతారన్న ప్రచారం బాగా ఊపందుకుంది. బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. అయితే.. ఈ వ్యాఖ్యలపై మర్రి శశిధర్ వివరణ ఇచ్చారు. తాను ఢిల్లీకి రావడం కొత్తేమీ కాదని, తన మనుమడి స్కూల్ ఫంక్షన్ కోసమే ఢిల్లీకి వచ్చినట్లు అంటున్నారు. బీజేపీలో చేరేందుకే ఢిల్లీకి వచ్చినట్లు వస్తున్న వార్తలన్నీ ఊహాజనితమేనని అన్నారు.