బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సుప్రీం కోర్టు జూలై 31 కి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలో వుందని, అందుకే దర్యాప్తుపై స్టే విధించాలని సుప్రీం ఆదేశాలిచ్చింది. జూలై 31 నుంచి మిస్ లేనియస్ పిటిషన్ కింద విచారణ జరుపుతామని అప్పటి వరకూ స్టే కొనసాగుతుందని సుప్రీం స్పష్టం చేసింది. అప్పటి వరకు దర్యాప్తు వివరాలను సీబీఐకి సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై31కి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.కాగా ఈ కేసును దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభఢుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ కేసుకు సంబంధించిన రికార్డులన్నీ సీబీఐకే ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.