దిల్ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెరకెక్కించారు. మార్చి 3న విడుదలైన చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సక్సెస్‌పై ప్రియదర్శి మీడియాతో మాట్లాడిన ఇంటర్వ్యూ విశేషాలు…
– ‘బలగం’ సినిమా చూసిన నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ‘మల్లేశం’ వంటి మూవీ తర్వాత మరో మంచి సినిమా చేశావని అందరూ అప్రిషియేట్ చేశారు.
– చాలా మంది రెండు, మూడు సార్లు చూసిన వాళ్లు ‘బలగం’ ఓ గొప్ప సినిమా అని అన్నారు. థియేటర్స్‌లో ఏడ్చినప్పటికీ సంతోషంగా బయటకు వస్తున్నారు. విన్సెంట్ అనే నా ఫ్రెండ్ అయితే సినిమా చూసి తన గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని ఏడ్చి రిలీఫ్‌గా ఫీల్ అయ్యాడు. ఇలాంటివన్నీ వింటుంటే మనకు చిన్నప్పుడు వేమన పద్యాలు, ఏమైనా మంచి మాటలు వినప్పుడు కొత్తగా ఏమైనా చేయాలనే ఐడిలిజం ఫీలింగ్ వస్తుంటుంది. అలాంటి ఫీలింగ్సే.. ‘బలగం’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే కలుగుతుందని ఆడియెన్స్ అంటున్నారు. మనిషిని లోలోతుగా కదిలించిన సినిమా అంటునారు.
– మానాన్నగారు లెక్చరర్ ఆయన ఉగ్గు కథలు వంటి ప్రోగ్రామ్స్‌కి నన్ను తీసుకెళుతుండేవారు. ఉగ్గు కళాకారులు ఎలా ఉంటారంటే ఆగకుండా రోజంతా కూడా కథలు చెప్పగలరు. అలాంటి టాలెంట్ ఉన్న వేణుగారు, రమేష్‌గారిని చూడగానే వీళ్లు మామూలు వాళ్లు కాదనిపించింది.













