బయో ఇథనాల్ ప్లాంట్ యూనిట్ నిర్మాణ పనులకు శంకు స్థాపన చేసిన సీఎం జగన్

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ల దొడ్డి దగ్గర అగోసా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసిన బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకు స్థాపన చేశారు. 270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ నిర్మిస్తున్న ఈ యూనిట్ నిర్మాణ పనుల వల్ల 500 మందికి ఉపాధి కూడా లభిస్తుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… 270 కోట్లతో టెక్ మహీంద్రా గ్రూప్ ఇథనాల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోందని, ఈ ప్రాంతానికి మంచి చేసే ప్లాంట్ రాబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. పరిశ్రమలను నెలకొల్పేందుకు ఏపీలో మంచి వాతావరణం వుందని, కేవలం 6 నెలలోనే అనుమతులు మంజూరు చేసి, ఈ రోజు భూమి పూజ కూడా చేశామని వివరించారు. 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్లాంట్ రాబోతోందని, ప్లాంట్ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి కూడా దొరుకుతుందని వివరించారు. ప్లాంట్ తో పాటు బైప్రోడక్ట్ కింద పశువుల దాణా, చేపల మేతకు ఉపయోగపడే ప్రోటీన్ ఫీడ్ కూడా అందుబాటలోకి వస్తుందని సీఎం జగన్ చెప్పారు.

 

రోజుకు 200 కిలో లీటర్ల బయో ఇథనాల్

రాజమండ్రికి సమీపంలో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ రోజుకు 200 కిలో లీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి చేస్తుంది. ముడి చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతో పాటు హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా 2025 నాటికి ప్రతి లీటరు పెట్రోల్ లో 20 శాతం బయో ఇథనాల్ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కొద్ది రోజుల క్రిందటే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Related Posts

Latest News Updates