సీఎం జగన్ నేడు నర్సీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ఈ రోజు నర్సీపట్నంలో 986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని, చాలా ఆనందంగా వుందన్నారు. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తామని, ప్రతి మాటను నిలబెట్టుకుంటామని ప్రకటించారు. ప్రతి కార్యకర్త కూడా తలెత్తుకునేలా పాలన చేస్తున్నామని అన్నారు. జనవరి 1 నుంచి పెన్షన్లను 2,750 రూపాయలకు పెంచుతున్నామని ప్రకటించారు. గత పాలకులు నర్సీపట్నంను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పెన్షన్లను పెంచుతుంటే ఓర్వలేక పోతున్నారని, అందుకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక… చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభపై కూడా సీఎం జగన్ విమర్శలు చేశారు. ఫోటో షూట్ కోసం, డ్రోన్ షాట్ కోసమే కందుకూరు సభ అని మండిపడ్డారు. 8 మందిని చంపేశారని, ఇంతకంటే ఘోరం ఏమైనా వుంటుందా అని ప్రశ్నించారు.గోదావరి పుష్కరాల్లోనూ షూటింగ్ కోసం 29 మంది ప్రాణాలను తీశారని మండిపడ్డారు. అప్పుడు కూడా ప్రజలు ఇదేం ఖర్మరా బాబూ అనుకున్నారని జగన్ ఎద్దేవా చేశారు.