ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అలా నిన్ను చేరి ఫస్ట్‌ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. హుషారు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో దినేష్ తేజ్ మరోసారి ఈ విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నేటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చక చకా కంప్లీట్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా షురూ చేసి నూతన సంవత్సర కానుకగా అలా నిన్ను చేరి ఫస్ట్‌ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసి సినిమా సోల్ తెలిసేలా స్పెషల్ గా అట్రాక్ట్ చేశారు మేకర్స్. ఓ పక్క పల్లెటూరు, మరోపక్క మెట్రో సిటీ.. ఈ రెండు ప్రదేశాలను కలుపుతూ హీరోని బ్యాక్ నుంచి చూపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే పల్లెటూరు నుంచి కెరీర్ కోసం సిటీకి చేరిన కుర్రాడు.. అమ్మాయి ప్రేమలో పడి తన జర్నీ ఎలా సాగించాడనేది ఈ సినిమా కథ అని తెలుస్తోంది.

‘అలా నిన్ను చేరి’ సినిమాకు పాటలు చంద్రబోస్, సంగీతం సుభాష్ ఆనంద్ అందిస్తుండగా.. ఆండ్రూ కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. పలు సూపర్ హిట్ సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించిన కోటగిరి వెంకటేశ్వర రావు ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేస్తున్నారు. కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా చేస్తున్న ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా విఠల్, క్యాస్టూమ్ డిజైనర్‌గా ముదసరా మహ్మద్ వ్యవహరిస్తున్నారు. సాల్మన్, రామకృష్ణ ఫైట్ మాస్టర్లుగా, సాంగ్స్ కొరియోగ్రాఫర్ గా భాను వర్క్ చేశారు. అతిత్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Related Posts

Latest News Updates