ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, హర్రర్ డ్రామా ‘మసూద’ వంటి విభిన్న కథలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మీడియా సమావేశం నిర్వహించారు. నిజాయితీతో, క్రమశిక్షణతో ఏ పని చేసినా.. విజయం ఖచ్చితంగా వస్తుందనే దానికి ఉదాహరణే స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి వచ్చే చిత్రాలని ఆయన చెబుతున్నారు. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనేదే తన ఫిలాసఫీ అంటున్న ఈ యంగ్ నిర్మాత.. ఈ 5 సంవత్సరాలలో తను అనుకున్నదానికంటే కూడా ఎక్కువే సాధించానని తెలుపుతూ.., అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
‘మసూద’ సినిమా విజయం సాధించినందుకు, అందరి నమ్మకం నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, హ్యాట్రిక్ అనిగానీ, నెంబర్స్ గురించిగానీ అస్సలు ఆలోచించలేదన్నాడు. మంచి స్టోరీ. జెన్యూన్‌గా, హానెస్ట్‌గా, క్రమశిక్షణతో సినిమా తీస్తే.. జనాలకు నచ్చుతుందని, డబ్బులు కూడా వస్తాయని నమ్మానని పేర్కొన్నారు. మొదటి సినిమా‘మళ్లీరావా’ నుంచి ఇదే నమ్ముతున్నానని తెలియజేశాడు.
తెలియని క్యాస్ట్ ఉంటే చిన్న సినిమాల కేటగిరిలో పెట్టేస్తారని, రెమ్యూనరేషన్స్‌కి హై బడ్జెట్ పెట్టి.. పెద్ద సినిమా అంటే, టెక్నికల్‌గా ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు చిన్న సినిమాలు ఎందుకు అవుతాయి? అని ప్రశ్నించాడు. పెద్ద సినిమా ఎందుకు కాదు? పెద్ద హీరోలు చేసే సినిమాలకు టెక్నికల్‌గా ఈ సినిమా ఆ లెవల్లో ఉందన్నాడు. తాను క్యాస్టింగ్‌కి బడ్జెట్ పెట్టడం లేదు.. వాళ్లు పెడుతున్నారు అంతే అని వివరించాడు.
‘మసూద’ ఫస్ట్ డే తక్కువ థియేటర్లలోనే విడుదలైందని, ఆ తర్వాత వచ్చిన టాక్‌తో రోజురోజుకు థియేటర్లు పెరిగాయని తెలిపాడు. తన ఫస్ట్ సినిమా నుంచి శుక్రవారం సినిమా విడుదలైతే.. శనివారం నుంచే థియేటర్లు పెరుగుతూ వచ్చాయని,
స్టార్ హీరోల సినిమాలకు పబ్లిసిటీ ఎంత చేస్తే అంత జనాల్లోకి ఆ సినిమా వెళుతుంది. మొదటి నుంచి సినిమాపై అంచనాలు ఉంటాయి కాబట్టి.. థియేటర్లకి ప్రేక్షకులు వస్తారు. కానీ ‘మసూద’ వంటి సినిమాలకు.. సినిమా బాగుంటే తప్పితే.. విడుదలకు ముందు ఎంత ప్రమోట్ చేసినా జనాలు పట్టించుకోరన్నారు. తాను సినిమా తీసే విధానంలో ఎంత జాగ్రత్త పడతానో.. ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నానని తెలిపారు.












