ప్రముఖ వాలీబాల్ టీమ్ “హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌” కు సహ యజమానిగా మారిన సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ

దేశ వ్యాప్తంగా అశేష అభిమానగణం కలిగిన యువ సూపర్‌స్టార్‌ , ఫిలింఫేర్‌ అవార్డు, నంది అవార్డు, సైమా అవార్డు సహా ఎన్నో అవార్డులు గెలుచకున్న విజయ్‌ దేవరకొండ ఇప్పుడు భారతదేశంలో అగ్రగామి ప్రొఫెషనల్‌ టీమ్‌లలో ఒకటైన హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ సహ యజమానిగా మారారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్కటీమ్‌ హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌. ‘అర్జున్‌ రెడ్డి’ మరియు ‘పెళ్లి చూపులు ’ వంటి చిత్రాలలో విభిన్నమైన పాత్రల ద్వారా ప్రాచుర్యం పొందిన శ్రీ విజయ్‌ దేవరకొండ , బ్లాక్‌ హాక్స్‌ టీమ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. లీగ్‌ మ్యాచ్‌లకు ఆవల ప్రచారం చేయడంతో పాటుగా అంతర్జాతీయంగా వీక్షకుల ముందుకు విభిన్నంగా ఈ టీమ్‌ను ప్రదర్శించనున్నారు.

బ్లాక్‌హాక్స్‌ ముఖ్య యజమాని అభిషేక్‌ రెడ్డి కనకాల మాట్లాడుతూ ‘‘విజయ్‌ మాతో చేరడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌ మరియు సహ యజమానిగా వ్యవహరించనున్నారు. ఆయన తనతో పాటుగా టీమ్‌కు నూతన విధానం తీసుకురావడం వల్ల మా బ్రాండ్‌ను మరో దశకు తీసుకువెళ్లగలము. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల సంస్కృతి, స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహించాలనే మా లక్ష్య సాధన దిశగా అతి పెద్ద ముందడుగనూ వేశాము. రాబోయే వాటి గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.
ఈ మహోన్నత భాగస్వామ్యం గురించి శ్రీ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ బ్లాక్‌ హాక్స్‌ మరో స్పోర్ట్స్‌ టీమ్‌ అని కాకుండా అంతకు మించినది. తెలుగు వారసత్వం సగర్వంగా ప్రదర్శించాలనుకునే మా అందరికీ ఇది గర్వ కారణం. తెలుగు ప్రజలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాదు, మన స్ఫూర్తి మరియు శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మా బ్రాండ్‌ మరియు టీమ్‌ను భారతదేశం మాత్రమే కాదు, ఇతర ప్రాంతాలకు సైతం తీసుకువెళ్లేందుకు చేయాల్సినంతగా నేను చేస్తాను’’ అని అన్నారు.

 

బ్లాక్‌హాక్స్‌ లక్ష్య సాధన గురించి ఈ జంట మాట్లాడుతూ ‘‘మా లక్ష్యం, మా ప్రజలు. ప్రతి దశలోనూ వారి జీవితాలను మెరుగుపరచాలని ప్రయత్నిస్తున్నాము. (ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌) మ్యాచ్‌ కేవలం ఆరంభం మాత్రమే. వాలీబాల్‌ను దేశంలో ప్రతి మూలకూ తీసుకువెళ్లాలన్నది మా లక్ష్యం. అన్ని వయసులు, లింగాలు, బ్యాక్‌గ్రౌండ్స్‌, అన్ని స్ధాయిల అథ్లెటిజం కలిగిన ప్రజలకు దీనిని చేరువ చేయాలనుకుంటున్నాము. మన నగరాల్లాగానే మన గ్రామీణ ప్రాంతాలలో సైతం కమ్యూనిటీలకు తగిన సాధికారిత అందించాలనుకుంటున్నాము. అలాగే మన చిన్నారులకు సమానమైన అవకాశాలనూ అందించాలనుకుంటున్నాము. మేము వాలీబాల్‌ను కేవలం ఓ క్రీడగా మాత్రమే కాదు, దీనిని ప్రతి ఒక్కరికీ సహాయపడుతూనే , ప్రయోజనం కలిగించే రీతిలో మార్చాలనుకుంటున్నాము’’అని అన్నారు.
రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ పవర్డ్‌ బై ఏ 23 అనేది ప్రైవేట్‌ యాజమాన్య నిర్వహణలోని ఇండియన్‌ ప్రొఫెషనల్‌ వాలీబాల్‌ లీగ్‌. హైదరాబాద్‌, అహ్మాదాబాద్‌, కోల్‌కతా, కాలికట్‌, కొచి, చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి ఎనిమిది టీమ్‌లు దీనిలో పోటీపడుతున్నాయి.

 

ఈ లీగ్‌ తొలి సీజన్‌ అపూర్వ విజయం సాధించింది. ఇది ఒకే సమయంలో ఇంగ్లీష్‌ , హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషలలో ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్‌లు మొత్తంమ్మీద 41 మిలియన్‌ టెలివిజన్‌ వ్యూయర్‌ షిప్‌ నమోదు చేయడంతో పాటుగా 43 మిలియన్‌ స్ట్రీమింగ్‌ వ్యూయర్‌షిప్‌ నమోదు చేసింది. అదనంగా, ఈ సీజన్‌ పలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ వ్యాప్తంగా 5 మిలియన్‌ ఫ్యాన్‌ ఎంగేజ్‌ మెంట్స్‌ను సొంతం చేసుకుంది. దీనితో పాటుగా భారీ ప్రాంతీయ కనెక్షన్స్‌ను సామాజిక మాధ్యమ వేదికలైనటువంటి షేర్‌చాట్‌ , మోజ్‌ ద్వారా పొందింది.
ఈ లీగ్‌ రెండవ సీజన్‌లో 31 మ్యాచ్‌లు 04 ఫిబ్రవరి నుంచి 05 మార్చి వరకూ జరుగనున్నాయి. దీనిని భారతదేశంలో ప్రత్యేకంగా సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ తమ సోనీ స్పోర్ట్స్‌ 1, 3, 4లలో ప్రసారం చేయడంతో పాటుగా సోనీ లివ్‌పై స్ట్రీమింగ్‌ చేయనుంది. అంతర్జాతీయంగా ఈ మ్యాచ్‌లు వాలీబాల్‌ వరల్డ్‌ స్ట్రీమ్‌ చేయనుంది. వాలీబాల్‌ యొక్క గ్లోబల్‌ గవర్నింగ్‌ బాడీ , ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డి వాలీబాల్‌ (ఎఫ్‌ఐవీబీ) యొక్క వాణిజ్య విభాగం ఇది.

 

హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ అనేది ప్రొఫెషనల్‌ మెన్స్‌ వాలీబాల్‌ టీమ్‌. హైదరాబాద్‌ కేంద్రంగా ఇది ఉంది. అతి తక్కువ వయసు సగటు కలిగిన ఈ టీమ్‌, ఎడతెగని శక్తి మరియు స్ర్కిప్ట్‌కు ఆవల ఆలోచించడం పట్ల మక్కువ కలిగింది. తమ ముఖ్య యజమాని అభిషేక్‌ రెడ్డి కంకణాల యొక్క లక్ష్యంకు అనుగుణంగా ఈ టీమ్‌ , కోర్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడం తో పాటుగా కోర్ట్‌ వెలుపల అభిమానులతో అనుసంధానించబడటం ద్వారా ప్రాచుర్యం పొందింది. ఈ బ్లాక్‌హాక్స్‌ టీమ్‌ తొలి సీజన్‌లో సెమీ ఫైనలిస్ట్‌గా నిలిచింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో అహ్మాదాబాద్‌ డిఫెండర్స్‌ చేతిలో ఓడింది.

అభిషేక్‌ రెడ్డి కంకణాల ఓ ఆవిష్కర్త మరియు వ్యాపారవేత్త. హైదరాబాద్‌ కేంద్రంగా ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో పాటుగా విజయవంతంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడంలో 20 సంవత్సరాల అనుభవం ఆయనకు ఉంది. ప్రస్తుతం ఆయన పలు స్పోర్ట్స్‌ టీమ్‌లు, లాజిస్టిక్‌ కంపెనీలు మరియు మరెన్నో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌తో పాటుగా ఆయన బెంగళూరు రాప్టార్స్‌కు కూడా ముఖ్య యజమాని. ఆ టీమ్‌ ప్రీమియర్‌ బాడ్మింటన్‌ లీగ్‌లో రెండు సార్లు వరల్డ్‌ చాంఫియన్‌గా నిలిచారు. అలాగే తెలంగాణా ప్రీమియర్‌ గోల్ఫ్‌ లీగ్‌లో దేవ్‌ పిక్సెల్‌ డెవిల్స్‌ టీమ్‌ను కూడా ఆయన సొంతం చేసుకున్నారు.

 

విజయ్‌ దేవరకొండ, ఓ యువ భారతీయ సూపర్‌స్టార్‌. తెలుగు సినిమాలలో అసాధారణ ప్రదర్శన తో అశేష అభిమానులను కలిగిన ఆయన ఇప్పుడు జాతీయ స్ధాయిలో కూడా నటిస్తున్నారు. బ్లాక్‌హాక్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ సహ యజమానిగానే కాక ఆయన పలు సంస్థలలోనూ పెట్టుబడులు పెట్టి సీరియల్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌గానూ నిలిచారు. విజయ్‌ తన సొంత స్ట్రీట్‌వేర్‌ ఫ్యాషన్‌ లైన్‌ రౌడీ, ఓ థియేటర్‌ మల్టీప్లెక్స్‌ ఏవీడీ, రీజనల్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ అహ సహ యజమాని మరియు మూవీ ప్రొడక్షన్‌ హౌస్‌ కింగ్‌ ఆఫ్‌ ద హిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిగి ఉన్నారు.

Related Posts

Latest News Updates