ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో మరో మూవీ… ప్రకటించిన దిల్ రాజు

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రస్తుతం సలార్ సినిమా నడుస్తోంది. అయితే… సూపర్ హిట్ నిర్మాత దిల్ రాజు అదిరిపోయే అప్ డేట్ ఒకటి ఇచ్చారు. సలార్ తర్వాత ప్రభాస్- ప్రశాంత్ నీల్ కలిసి మరో సినిమా కూడా తీస్తున్నట్లు ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు ఈ విషయాన్ని ప్రకటించాడు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ పౌరాణిక సినిమా రానుందని, దీనికి స్క్రిప్ట్ కూడా సిద్ధమైందన్నాడు. ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీ వున్నారని, దీని తర్వాత ప్రభాస్ సినిమా ప్రారంభమవుతుందని వెల్లడించారు.

 

తాజాగా సలార్ టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఈమూవీ టీజర్ కుదిరితే జాన్ చివరి వారంలోనే విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాగైతే కోరుకుంటున్నారో ఆ అంశాలన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. జూన్ 16న ప్రభాస్, కృతి సనన్ కలిసి నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా విడుదలైన కొద్దిరోజులకే అంటే జూన్ చివరివారంలో సలార్ టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

Related Posts

Latest News Updates