వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల పోలీసు అధికారులపై చేయి చేసుకున్నారు. ఓ ఎస్ఐ, మహిళ కానిస్టేబుల్‌పై షర్మిలా చేయిసుకున్నారంటూ పోలీసులు ఆమెను అరెస్టు చేసి పీఎస్‌కు తీసుకువచ్చారు. రెండు సెక్షన్లకింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేయడంలేదని, దీనికి సంబంధించి సిట్ అధికారులను కలిసి మెమొరాండం ఇచ్చేందుకు వైఎస్సార్ టీపీ భావించింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం లోటస్ పాండ్‌లో తన నివాసం నుంచి షర్మిల బయలుదేరుతున్న నేపథ్యంలో పోలీసులు ఆమెను అడ్డుకుని.. అనుమతి లేదని చెప్పారు. ఈ క్రమంలోనే ఆమెకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

మరోవైపు ఈ దాడి ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ఎస్ఐ , కానిస్టేబుల్‌పై షర్మిల చేయిచేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఐపీసీ 332, 353 సెక్షన్ల కింద షర్మిలపై కేసు నమోదు చేశారు. అయితే… పోలీసులు షర్మిలపై ఫిర్యాదు చేస్తే కచ్చితంగా చర్యలుంటాయని ఉన్నతాధికారులు ప్రకటించారు.