పొల్యూషన్ సర్టిఫికెట్ చూపిస్తేనే పెట్రోల్.. ఢిల్లీలో కొత్త విధానం

కాలుష్య నియంత్రణలో భాగంగా కేజ్రీవాల్ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 25 నుంచి వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని బంకులను ఆదేశించింది. సెప్టెంబర్ 29న ఎన్విరాన్ మెంట్, ట్రాన్స్ పోర్ట్, ట్రాఫిక్ డిపార్ట్ మెంట్లతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. దీనికి సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించారు.

 

ఢిల్లీలో కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు అక్టోబర్ 25 నుంచి వెహికిల్ పొల్యూషన్ సర్టిఫికెట్ చూపించిన వారికే పెట్రోల్, డీజిల్ విక్రయిస్తారని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కువ కాలుష్యం వున్న వాహనాలు రోడ్లపై తిరగకుండా నిరోధించేందుకే ఈ నిర్ణయమని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. కాలుష్య నివారణకు ఢిల్లీలో ఆప్ సర్కార్ సరి- బేసి విధానాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే.

Related Posts

Latest News Updates