పుష్ప‌2 క్రేజ్‌కు ఇదే ప్రూఫ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న పుష్ప‌2 సినిమా కోసం అంద‌రూ ఎంత‌గా ఎదురుచూస్తున్నార‌నేది తెలిసిన విష‌య‌మే. రీసెంట్ గా రిలీజైన టీజ‌ర్ లో ఎక్కువ కంటెంట్ రివీల్ చేయ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ అప్‌సెట్ అయిన మాట వాస్త‌వ‌మే అయిన‌ప్పటికీ ఆ టీజ‌ర్ లో అల్లు అర్జున్ గెట‌ప్ చూసి ట్రేడ్ వ‌ర్గాల్లో ఉన్న హైప్ ఒక్క‌సారిగా పెరిగింది. https://cinemaabazar.com/

టీజ‌ర్ యూట్యూబ్ లో 138 గంట‌ల పాటూ టాప్ ట్రెండింగ్ లో ఉండ‌టంతో కొత్త రికార్డు పుష్ప‌2 పేరిట రికార్డైంది. పుష్ప‌2 నుంచి పాటో, ట్రైల‌రో వ‌చ్చే లోపు టీజ‌ర్ వ్యూస్ మ్యాజిక్ ఫిగ‌ర్స్ న‌మోదు చేయ‌డం ఖాయం. టీజర్ కే ఈ రేంజ్ లో ఉందంటే పుష్ప‌2 మానియా ఏ స్థాయిలో ఉండ‌బోతుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఓ రకంగా చెప్పాలంటే ఈ రెస్పాన్స్ చాలా ఎక్కువ‌. https://cinemaabazar.com/

ఫ‌స్ట్ రోజు ఎక్కువ వ్యూస్ సాధించ‌లేక‌పోయినా, ఆ త‌ర్వాత నాన్ స్టాప్ గా నెంబ‌ర్ వ‌న్ ట్రెండింగ్ లో ఉండ‌టమంటే మాట‌లు కాదు. ఈ సినిమాతో రూ.1000 కోట్ల బిజినెస్ ను ఆశిస్తున్న మైత్రీ మూవీ మేక‌ర్స్, సినిమాను దానికి త‌గ్గ‌ట్టే ప్ర‌మోట్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆ యాంగిల్ లో చూస్తే పుష్ప‌2 స‌క్సెస్ అయింద‌నే చెప్పాలి. ఆగ‌స్టు 15న రిలీజ్ కానున్న పుష్ప‌2 షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

Related Posts

Latest News Updates